అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని తలకొండపల్లి ఎస్సై ఎ శ్రీకాంత్ హెచ్చరించారు. తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామ శివారులో అక్రమ ఇసుక తరలిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పడకల్ శివారులో అక్రమంగా తరలిస్తున్న ఒక జేసీబీ, ట్రాక్టర్ ఇంజన్ 20 టన్నుల ఇసుకను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఏ శ్రీకాంత్ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న దళారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ. శ్రీకాంత్ పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టంపరంగా చర్యలు చేపడతామని అక్రమ ఇసుక దళారులను ఎస్ఐ ఏ శ్రీకాంత్ హెరించారు.
Thalakondapalli: ఇసుక అక్రమ రవాణాపై ఎస్సై సీరియస్
తలకొండపల్లి ఎస్సై ఏ శ్రీకాంత్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES