Sunday, June 30, 2024
Homeనేరాలు-ఘోరాలుThorruru: రాత్రివేళ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

Thorruru: రాత్రివేళ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

గ్రామానికి ముంపు ముప్పు తప్పదు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నయి. సంబంధిత అధికారులు ముడుపులు తీసుకొని నచ్చిన చోట తోసినంత తరలించుకునే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టి నిర్వాహకులు గత రెండు నెలలుగా డబ్బులు చేత పట్టుకొని సారవంతమైన రేగడి మట్టి కోసం అన్వేషిస్తున్నారు. చెరువులోని నీరు తగ్గగానే రేగడి మట్టి వేట మొదలైంది. ఇదంతా ఎక్కువగా మే, జూన్ నెలల్లో జోరుగా సాగుతుంది. ఇటుక బట్టీల నిర్వాహకులు మాత్రం ఇష్ట రాజ్యాంగ చెరువులు కుంటల్లోని మట్టిని తవ్వి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రకృతి సంపద హరించుకుపోతుంది.

- Advertisement -

తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలోని చెరువు నుండి జెసిబితో రాత్రివేళ అక్రమంగా పత్తేపురం స్టేజి సమీపంలోని ఇటుక బట్టీలకు రేగడి తరలిస్తుండగా ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేస్తున్న గోపాలగిరి గ్రామస్తులు .. రేగడి తోలొద్దని ఉదృతం చేస్తున్న ప్రజలు…నాయకులతో బేరాలు మాట్లాడుకుని ప్రశ్నించిన వారితో కూడా బేరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్న ఇటుక బట్టి నిర్వాహకులు.. ఇటుక బట్టీ నిర్వాహకులు రేగడి మట్టి తవ్వకాన్ని అడ్డుకున్న ప్రజలతో బేరాలు మాట్లాడుతూ మీకు ఇటుక కావాలంటే ఫ్రీగా రెండు మూడు ట్రిప్పులు పంపిస్తామని బేరాలు మాట్లాడుతున్నారని గోపాలగిరి ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి తవ్వకాలతో చెరువులోని రేగడి మట్టిని తవ్వి పెద్ద పెద్ద లోయలు చేస్తున్నారని దానివల్ల గ్రామస్తులకు ప్రమాదమని గ్రామస్తులు రేగడి తరలిస్తుంటే అడ్డుకున్నారు. జెసిబి ట్రాక్టర్ ల సహాయంతో ఇటుక బట్టీలకు రాగడి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులు కుంటలు మరియు ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూముల అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిపి రేగడి మట్టిని అమ్ముకొని లక్షల్లో సంపాదిస్తున్నారు. అదే పంట పొలాల్లోకి సారవంతమైన రేగడి తరలిస్తామంటే మాత్రం అధికారులు ప్రజా ప్రతినిధులు లేనిపోని నిబంధనలు పేరుతో ప్రజలను భయపెడతారని, వ్యాపారులు దొంగ చాటున తరలించేందుకు ఎలాంటి నిబంధనలు అడ్డు రావడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి జెసిబిలతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లతో అక్రమంగా పత్తేపురం స్టేజి వద్ద ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తుండగా గోపాలగిరి గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు ఎక్కడ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని అనుమానం సగటు పౌరునికి కలుగుతుంది. ముఖ్యంగా మట్టి తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, యంత్రాంగం, మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, నిద్రమత్తులో తూగుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వాహనదారులకు పట్టలేని దుమ్ము

తొర్రూరు మడలంలోని వరంగల్, ఖమ్మం హైవే రోడ్డుకు ఆనుకొని ఇటుక బట్టీలు ఉండడంతో రోజువారి వాహనదారులకు అధిక దుమ్ముదూళితో రోగాల పాలవుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇటుక బట్టిలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News