Selling Mattresses of Deceased: అంత్యక్రియల అనంతరం పారేసిన దుప్పట్లు, పరుపులతో వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు కొందరు ముఠా. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖాండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/international-news/trump-welfare-list-excludes-india-indians-assets/
మృతదేహం ఊరేగింపు సమయంలో ఉపయోగించిన దుప్పట్లు, పరుపులను అంత్యక్రియల అనంతరం అక్కడే ఓ చోట పారవేస్తారు బంధువులు. మళ్లీ వాటిని ఉపయోగించకూడదనేది మతపరమైన సంప్రదాయం. అయితే దీనినే వ్యాపారంగా మార్చుకున్నారు కొందరు అత్యాశపరులు. ఎవరూ చూడని సమయం చూసి వాటిని సేకరించి కొత్త దుప్పట్లు, పరుపులుగా మార్చి మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఖంగుతిన్నారు. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆందోళన చెందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషికేశ్‌లోని పూర్ణానంద్ ఘాట్‌లో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత బంధువులు.. దారిలోని సాత్ మోడ్ అనే ప్రదేశంలో ఉన్న రావి చెట్టు కింద దుప్పట్లు, పరుపులను విసిరేస్తారు. ఇది గమనించిన కొందరు ముఠా వాటిని అక్కడి నుంచి తీసుకొని ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై ఓ స్థానికుడి నుంచి ఫిర్యాదు అందుకున్న రాణిపోఖరి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-new-air-quality-monitoring-stations/
నిందితులు తాము సేకరించిన దుప్పట్లు, పరుపుల నుంచి పత్తిని సేకరించి, కొత్త పత్తితో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించామని రాణిపోఖరి పీఎస్ ఇన్‌ఛార్జ్ వీరేంద్ర చారి తెలిపారు. రాణిపోఖారి చౌక్‌లోని ఒక దుకాణంపై దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా నివాసి సల్మాన్ (24), అతని తండ్రి హమీద్ అలీ (55)కి పాత దుప్పట్లు, పరుపులను రిషికేశ్ నివాసి సంజయ్ (35) అందిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

