Toddler Raped By Neighbour In Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది వయసున్న చిన్నారిపై 32 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఢిల్లీలోని బిస్వాసన్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ALSO READ: Law College Rape Case: మొదటి సంవత్సరం విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. చార్జిషీట్‌లో సంచలన విషయాలు
బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం, పక్కింట్లో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి చిన్నారిని తన గదిలోకి తీసుకెళ్లాడు. కొంతసేపటికి చిన్నారి ఏడుపు విని తల్లి వెంటనే ఆ గది దగ్గరికి వెళ్ళింది. తలుపు లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో, ఆమె ఎలాగో తలుపు తెరిచి చూడగా, చిన్నారి బట్టలు లేకుండా, రక్తం కారుతూ కనిపించింది.
ALSO READ: Cricket Bat: క్రికెట్ బ్యాట్ కోసం 10 ఏళ్ల బాలిక దారుణ హత్య.. కత్తితో 21 సార్లు పొడిచి
వెంటనే తల్లిదండ్రులు కపాషేరా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్‌కు చెందినవాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


