Cyber Crime : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామంలో జరిగిన సైబర్ మోసం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. స్థానికంగా హోటల్ నడుపుతున్న నిరంజన్ రెడ్డికి శుక్రవారం రాత్రి మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ‘ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీ వాహనంపై చలానా ఉంది, వెంటనే చెల్లించండి’ అని రాష్ట్ర పోలీసులు పంపినట్లు ఉంది. అది APK ఫైల్ రూపంలో వచ్చిన మెసేజ్. పూర్తి వివరాల కోసం ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయమని సూచించారు.
ALSO READ:Andhra Pradesh: ఏపీలో అల్పపీడనం..రేపటి నుంచి భారీ వర్షాలు!
నిరంజన్ రెడ్డి ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. యాప్ తెరిచిన తర్వాత OTP అడిగింది. అనుమానం వచ్చి ఆయన ప్రక్రియను మధ్యలోనే ఆపేశారు. కానీ, మరుసటి రోజు ఉదయం ఆయన క్రెడిట్ కార్డు నుంచి రూ.61 వేలు, రూ.32 వేలు, మరోసారి రూ.20,999 డబ్బులు తీసుకున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. మొత్తం రూ.1.36 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ డబ్బుతో మోసగాళ్లు ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్‌లు కొనుగోలు చేశారు. వెంటనే కార్డును బ్లాక్ చేసినా, ఆలస్యమైంది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఇలాంటి ట్రాఫిక్ చలానా మోసాలు ఇటీవల భారత్ లో ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు లాగా నకిలీ మెసేజ్‌లు పంపి, మాల్‌వేర్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయిస్తారు. ఈ యాప్‌లు మొబైల్‌లోని బ్యాంక్ వివరాలు, OTPలు దొంగిలించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఇటీవల ఢిల్లీ, ముంబైలలో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు.
నిపుణులు చెబుతున్నట్లు, ట్రాఫిక్ చలానాలు చెల్లించాలంటే ఎప్పుడూ అధికారిక పార్‌వే వెబ్‌సైట్ (parivahan.gov.in) మాత్రమే ఉపయోగించాలి. అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు లింక్‌లు క్లిక్ చేయకుండా, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలి. మొబైల్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, రెగ్యులర్‌గా పాస్‌వర్డ్ మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి.


