ఏలూరు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం( Accident) జరిగింది. సోమర్పాడు-చోడిమల హైవేపై వేగంగా దూసుకెళుతున్న వెంకట రమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bus)బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్పాటులోనే ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మెుత్తం నలుగురు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి.
ప్రమాద వివరాలు
ఏలూరు జిల్లాలో సోమర్పాడు -చోడిమల హైవేపై జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడిందన్నారు.
గురువారం తెల్లవారుజామున ప్రమాదం
బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి కాకినాడకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు గురువారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా సోమర్పాడు-చోట్టిమల హైవేపై సమీపానికి రాగనే అదుపుతప్పి లారీని ఢీ కొట్టేసింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు
మరికొంతమంది సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అనంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Bus Accident: ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES