Triangle Love Story Woman Kills Lover With the help of Fiance: సాధారణంగా ప్రియుడి కోసం భర్తను చంపిన సంఘటనలు జరగడం చూస్తున్నాం. లేదా భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయిన ఉదంతాలు చూశాం. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వీటికి విభిన్నం. కాబోయే భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసింది ఓ మహిళ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపి.. ఓ వ్యక్తితో పరిణయమాడేందుకు మరో వ్యక్తిని దారుణంగా హతమార్చిన వైనం ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/crime-news/headless-body-of-woman-found-on-national-highway/
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ ఇద్దరితో ప్రేమాయణం నడిపి ఓ వ్యక్తిని వివాహం చేసుకునేందుకు మరో వ్యక్తిని హతమార్చింది. కానీ పోలీసులకు దొరికిపోవడంతో కాబోయే భర్తతో పాటు మహిళ సైతం కటకటాల పాలయ్యారు. ఇక ఈ హత్యకు మరో ఇద్దరు సహకరించడం కలకలం రేపుతోంది. మిథాపూర్ ప్రాంతంలో నివసించే లక్ష్మీ(29).. ఈస్ట్ వినోద్ నగర్‌కు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ చందర్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా, లక్ష్మీ చందర్‌తో పాటు కేశవ్(26)తో కూడా ప్రేమాయణం కొనసాగిస్తోంది. అయితే ఇటీవల కేశవ్‌కి, లక్ష్మీకి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించారు.
వీరి పెళ్లి విషయం తెలుసుకున్న చందర్, లక్ష్మిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. కేశవ్‌తో పెళ్లిని రద్దు చేసుకోకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో జరిగిన విషయాన్ని కేశవ్‌కు లక్ష్మీ వివరించింది. దీంతో ప్రియుడు చందర్‌ను హత్య చేసేందుకు ఇద్దరూ కుట్ర పన్నారు. అక్టోబర్ 25న చందర్‌ను మిథాపూర్‌కు రప్పించిన లక్ష్మీ.. ఫరీదాబాద్‌లోని ఆత్మద్‌పూర్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి బైక్‌పై తీసుకెళ్లింది.
వారి రాక కోసం అక్కడే వేచి ఉన్న కేశవ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి తాడుతో చందర్ గొంతునొక్కారు. అనంతరం అతడి తలపై కొట్టి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో చందర్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతడి హత్యపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి.. లక్ష్మీ, ఆమె కాబోయే భర్త కేశవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక హత్యకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.


