Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుTurkey: కొనసాగుతున్న మృత్యు ఘోష..17,000 మంది దాటిన మృతులు

Turkey: కొనసాగుతున్న మృత్యు ఘోష..17,000 మంది దాటిన మృతులు

టర్కీ శిథిలాల కింద ఒక్కొక్కటే మృతదేహం లభిస్తోంది. దీంతో ఇప్పటికే టర్కీ-సిరియా సరిహద్దుల్లోని భారీ భూకంపం ధాటికి 17,000 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇక శిథిలాల కింది చిక్కుకున్న వారిలో ప్రాణాలతో ఉండేవారి సంఖ్య చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. మరోవైపు టర్కీ ప్రజలు టర్కీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. సహాయ, పునరావాస చర్యలు ఏమాత్రం సరిగ్గా లేవని స్థానికులు తిరుగుబాటు చేస్తుండగా తమ తప్పును టర్కీ అధ్యక్షుడు అంగీకరించారు.

- Advertisement -

భూకంపం సంభవించిన 48 గంటల తరువాత కూడా కనీస సహాయం అందలేదని టర్కీ ప్రజలు సర్కారుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సాయంత్రం దాటగానే -5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో మంచు కురుస్తుంటే ప్రాణాలతో ఉన్నవారు వణికించే చలిని తట్టుకోలేకపోతున్నారు. కాగా సెకను సెకనుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని టర్కిష్ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News