Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుTurkey: 21,000 దాటిన మృతుల సంఖ్య

Turkey: 21,000 దాటిన మృతుల సంఖ్య

టర్కీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య 21,000 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం గాలింపు చర్యలను రేయింబవళ్లు నిర్వహిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. సోమవారం సంభవించిన భారీ భూకంపంతో పలు భవనాలు, అపార్ట్మెంట్స్ కుప్పకూలగా వాటిలో ఉన్న వారిలో అత్యధికులు మరణించారు. ఓవైపు వర్షం..మరోవైపు మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టడం అతి పెద్ద సవాలుగా మారింది.

- Advertisement -

టర్కీలో ఇప్పటివరకూ 17,674 మృతదేహాలు లభించగా సిరియాలో 3,377 మృతదేహాలను కనుగొన్నారు. దీంతో ఇరు దేశాల్లో మొత్తం మృతుల సంఖ్య 21,051కి చేరింది. భూకంపం సంభవించి ఐదోరోజు కావటంతో ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బతికున్నవారు, గాయపడ్డ వారు ఉండకపోవచ్చని ఇలా చిక్కుకున్నవారంతా మరణించి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. టర్కీలో ఏడు నగరాల్లో 3,000కి పైగా భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయని అధికారులు వెల్లడించారు. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారత్ పెద్ద ఎత్తున టర్కీ-సిరియాలకు సహాయ సహకారాలు అందిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News