టర్కీలో భూకంప మృతుల సంఖ్య 11,236కు చేరుకుంది. టర్కీ దక్షిణ ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు శిథిలాల కింద బయటపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక గాయపడ్డవారి సంఖ్య 37,001గా ప్రస్తుతానికి తేలింది. ఇటు టర్కీని ఆనుకుని ఉన్న సిరియా భూభాగంలో 2,662 మృతదేహాలను ఇప్పటికి వెలికి తీశారు. గంటగంటకూ మృతుల సంఖ్య, గాయపడ్డ వారి సంఖ్య పెరుగుతోంది.
- Advertisement -
భూకంపం ధాటికి టర్కీ-సిరియాలో ఆసుపత్రుల భవనాలు కూడా కుప్పకూలిపోవటంతో ప్రస్తుతం మందులు, మౌలిక సదుపాయాల లేమితో ఈ రెండు దేశాలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాయి. ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవటంతో ఇక్కడ సహాయ, పునారావాస చర్యలు చాలా మందంగా సాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య తారాస్థాయికి చేరుతోంది.