Twist After 6-Month-Old Baby’s Death, Father Blames Wife: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఆరు నెలల పసికందు మృతి కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. చిన్నారి సహజ మరణం చెందలేదని, హత్యకు గురై ఉంటుందని తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో, ఈ రోజు (శుక్రవారం) పసికందు మృతదేహాన్ని తిరిగి వెలికితీసి (Exhume) కొత్తగా పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
ఈ ఆరోపణలు రావడానికి కారణం, చనిపోయిన చిన్నారి తల్లికి మరొక మహిళతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించడమే.
ALSO READ: Insurance Fraud: భర్త చనిపోయాడంటూ రూ. 25 లక్షల ఇన్సురెన్స్ డబ్బు పొందిన మహిళ.. ఎలా బుక్కైందంటే..
సందేహం పెంచిన ‘వ్యక్తిగత’ మెసేజ్‌లు
వాస్తవానికి, ఈ నెల ప్రారంభంలో చిన్నారి తల్లి పాలు ఇస్తుండగా చనిపోయిందని మొదట భావించారు. ఆ సమయంలో అసాధారణ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే చిన్నారిని కుటుంబ వ్యవసాయ భూమిలో ఖననం చేశారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, చిన్నారి తండ్రి ఇటీవల అధికారులను సంప్రదించి, తన భార్యకు వేరే మహిళతో ఉన్న సంబంధానికి సంబంధించిన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను కనుగొన్నానని చెప్పారు. ఈ సంబంధం కారణంగా ఏర్పడిన ఒత్తిడి వల్లే తన బిడ్డను హాని చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు ఆయన దర్యాప్తు అధికారులకు తెలిపారు.
ALSO READ: Extramarital Affair: లవర్‌తో భర్తను చంపించిన ముగ్గురు పిల్లల తల్లి.. శవం దగ్గర ఏడ్చి లవర్‌తో పరార్..
మెడికల్ క్లారిటీకే ప్రాధాన్యం
ఈ కేసు విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకుండా, వైద్యపరమైన స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. “ముందుగా శిశువు హత్య చేయబడిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. హత్య అని తేలితే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. లేకపోతే, వారి వ్యక్తిగత సంబంధంతో మాకు సంబంధం లేదు,” అని ఆ అధికారి అన్నారు.
ఈ రోజు మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత, వైద్య బృందం పోస్ట్‌మార్టం నిర్వహించనుంది. ఈ నివేదిక ఆధారంగానే దర్యాప్తు ఏ దిశగా సాగాలనేది నిర్ణయమవుతుంది.
ALSO READ: Wife Eloped: భార్య ప్రియుడితో లేచిపోయిందని మనస్తాపం.. 4 ఏళ్ల కూతురిని చంపి, తండ్రి సూసైడ్!


