Tuesday, December 3, 2024
Homeనేరాలు-ఘోరాలుKukatpally | విద్యార్థినుల మిస్సింగ్ కేసులో ట్విస్ట్

Kukatpally | విద్యార్థినుల మిస్సింగ్ కేసులో ట్విస్ట్

కూకట్‌పల్లి (Kukatpally) లో ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్కేసులో ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ లో తప్పిపోయిన అమ్మాయిలు ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచ్ లో తేలారు. దీంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే… వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో హారిక (14), లక్ష్మీ దుర్గ (13) అనే ఇద్దరు విద్యార్థినులు 8వ తరగతి చదువుతున్నారు. బుధవారం ఉదయం స్కూల్ కి వెళ్లిన బాలికలు, సాయంత్రం తీసుకువచ్చేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు స్కూల్ వద్ద కనిపించలేదు. స్కూల్ సిబ్బందిని అడగగా వెళ్లిపోయారని చెప్పారు.

- Advertisement -

కానీ, ఇరువురూ ఇళ్ళకి వెళ్ళలేదు. చుట్టుపక్కల కూడా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకి గురైన ఇద్దరమ్మాయిల తల్లిదండ్రులు కూకట్‌పల్లి (Kukatpally) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరమ్మాయిలు స్కూల్ నుంచి బయటకి రావడం గమనించారు. కొంతదూరం వరకు ఇద్దరే వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఇది కిడ్నాప్ వ్యవహారం కాకపోయుండొచ్చు అని భావించిన పోలీసులు… బాలికల క్లాస్ మేట్స్ నుంచి సమాచారం రాబట్టారు. ఇద్దరూ సూర్యలంక బీచ్ కి వెళ్లినట్టు తెలుసుకున్నారు. దీంతో అక్కడి పోలీసులకు కూకట్పల్లి పోలీసులు సమాచారం అందించి తిరిగి ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News