Twist In Noida Dowry Case: నోయిడా వరకట్న వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిక్కి భాటి తన అత్తమామల చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ కేసులో ఇప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది. నిక్కి భాటి కుటుంబంపైనే వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె అన్నయ్య రోహిత్ పాయలా భార్య మీనాక్షి, తన అత్తమామలైన నిక్కి కుటుంబం తనను వరకట్నం కోసం వేధించిందని, ఇంటి నుంచి గెంటివేశారని ఆరోపించింది.
ALSO READ: Dowry death: ఎముకల గూడులా మారిన శరీరం.. కట్నం కోసం కసాయిలుగా మారిన అత్తవారిల్లు
2016లో మీనాక్షి, రోహిత్‌ల వివాహం జరిగింది. మీనాక్షి కుటుంబం కట్నంగా ఇచ్చిన మారుతీ సుజుకి సియాజ్ కారును ‘అశుభం’ అని చెప్పి, అమ్మివేశారని, ఆ తర్వాత స్కార్పియో కారుతో పాటు డబ్బులు డిమాండ్ చేశారని ఆమె పేర్కొంది. డిమాండ్లు తీర్చకపోవడంతో తనను పుట్టింటికి పంపించేశారని వాపోయింది. ఈ విషయం పంచాయితీకి చేరగా, రోహిత్ కుటుంబం రూ. 35 లక్షలు ఇచ్చి మీనాక్షికి మళ్లీ పెళ్లి చేయాలని లేదా కోడలిగా ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపింది. కానీ ఈ సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ: Horrific Murder in Medchal: అనుమానం పెనుభూతం.. గర్భవతిని కోసి మూసీలో పారేశాడు!
కాగా, ఈ కేసులో అరెస్టయిన నిక్కి మామ సత్యవీర్ సింగ్, మీనాక్షి తండ్రికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, ఈ సమస్యను పరిష్కరించడానికి రోహిత్ తండ్రి భిఖారి సింగ్ పాయలాతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది.
నిక్కి భాటి తన మామగారింటివారు వరకట్నం కోసం వేధించి, సజీవదహనం చేశారని ఆరోపిస్తూ ఆమె కుటుంబం పోలీస్ కేసు నమోదు చేసింది. అయితే, నిక్కి తండ్రి, వరకట్నం తమ సమాజంలో ఒక సంప్రదాయమని గతంలో పేర్కొనడం, ఇప్పుడు వారి కుటుంబంపైనే ఇలాంటి ఆరోపణలు రావడం ఈ కేసుని మరింత వివాదాస్పదంగా మార్చింది.
నిక్కీ కేసులో ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం నిక్కీ (28) అనే మహిళను ఆమె భర్త, అత్తామామలు కిరాతకంగా హత్య చేశారు. గురువారం రాత్రి ఆమె భర్త విపిన్ భాటి, అత్త దయా, మామ సత్యవీర్, బావమరిది రోహిత్ కలిసి దారుణంగా కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో నిక్కీ 70% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరినప్పటికీ, దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
ALSO READ: POCSO : పోక్సో కోర్టు సంచలన తీర్పు.. అత్యాచార కేసులో 50 ఏళ్ల జైలు శిక్ష


