Homeనేరాలు-ఘోరాలుTragedy: రాఖీ వేడుకలకు వచ్చి మృత్యు ఒడికి.. కుంటలో పడి సోదరులు మృతి

Tragedy: రాఖీ వేడుకలకు వచ్చి మృత్యు ఒడికి.. కుంటలో పడి సోదరులు మృతి

ములుగు (తెలుగు ప్రభ): రాఖీ పండుగకి తల్లితో కలిసి అమ్మమ్మ గారింటికి వచ్చిన అన్నదమ్ముళ్లకు అదే చివరి పండుగైంది. సరదాగా రెండు రోజులు గడుపుదామని వచ్చి చివరకు మృత్యు ఒడికి చేర్చారు. చిన్న వయసులోనే నూరేళ్లు నింపుకొని కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. ఈ హృదయవిదారక ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

- Advertisement -

జిల్లాలోని ములుగు మున్సిపాలిటీ పరిధిలో గణేశ్‌లాల్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ముళ్లు పడి మృతి చెందారు. మృతులు మాలోతు వినయ్ (15), రాజేష్ (12)గా గుర్తించారు. 

వీరు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి వినయ్‌, రాజేష్‌.. రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయి మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News