Neighbours Arrested for Raping Woman in Moving Car: త్రిపురలోని గోమతి జిల్లాలో కదులుతున్న కారులో ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా, పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు, ఆమెకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు గురువారం సాయంత్రం గోమతి జిల్లాలోని ఉదయ్ పూర్ పట్టణంలో ఉన్న త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్లారు. గుడి దర్శనం తర్వాత ముగ్గురూ కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే మిథున్ దేబ్‌నాథ్, బవర్ దెబ్బర్మా అనే ఆ ఇద్దరు యువకులు కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ALSO READ: Murder in UP: పెళ్లి ఒత్తిడితో దారుణం: ప్రియురాలిని ఏడు ముక్కలుగా నరికిన ప్రియుడు..!
రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న చెక్‌పోస్టు వద్ద కారును ఆపారు. అప్పుడు బాధితురాలు పోలీసులకు జరిగిన దారుణం గురించి చెప్పింది. వెంటనే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, ఆర్కే పుర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, 24 ఏళ్ల వయసున్న మిథున్, బవర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ బృందం కారును క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆమెను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ALSO READ: Extramarital affair : మనుమళ్లను ఎత్తుకునే వయసులో..కామంతో కట్టుకున్నోడినే కాటికి పంపింది!


