Sunday, March 8, 2026
Homeనేరాలు-ఘోరాలుFire Accident: లండన్‌లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల యువకులు మృతి

Fire Accident: లండన్‌లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల యువకులు మృతి

Telugu Students died in London Fire Accident: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి కన్నవారికి, పుట్టిన దేశానికి గర్వంగా నిలవాలని ఎంతో ఆశపడిన ఇద్దరు యువకుల జీవన ప్రయాణం విషాదాంతమైంది. అనుకోని ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. లండన్‌లో గత కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు మృతి చెందారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/third-world-telugu-conference-begins-in-konaseema-district-from-today/

లండన్‌లోని సౌత్ క్రోయిడాన్ ప్రాంతంలో గత సోమవారం(ఫిబ్రవరి 23)న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో గాయపడిన ఇద్దరు తెలుగు యువకులు మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఓ రెండంతస్తుల భవనంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ సంభవించింది. అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు యువకులు బిల్డింగులోనే చిక్కుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటలు భవనం అంతటా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన గంటి అభిషేక్‌(27) అక్కడిక్కడే మృతి చెందాడు. 2023లో ఎంబీఏ చదివేందుకు అభిషేక్‌ లండన్‌ వెళ్లాడు. చదువు పూర్తయిన అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వినాయక్ నగర్ నివాసి కామినేని సాయి శ్రీకర్‌.. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా,  ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: https://teluguprabha.net/top-stories/health-minister-damodar-rajanarsimha-launches-hpv-vaccination-program-in-telangana/

చేతికందిన కుమారులు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లండన్ ఫైర్ బ్రిగేడ్, మెట్రోపాలిటన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు యూకేలోని భారత కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News