Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుChild Sacrifice: భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన మామ

Child Sacrifice: భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన మామ

Child Sacrifice: శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత పురోగమనం సాధించినా ఇంకా కొందరు వ్యక్తులు మూఢ నమ్మకాలను వీడటం లేదు. అనేక మంది ఇప్పటికీ దొంగ బాబాలు, మాంత్రికుల మాటలు నమ్మి ఎంతటి అరాచకానికైనా తెగబడుతున్నారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి తన భార్య తిరిగి కాపురానికి రావాలని అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మాంత్రికుడి మాటలు నమ్మి మేనల్లుడినే నరబలి ఇచ్చేందుకు తెగించాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

ఏం జరిగిందంటే..

జూలై 19న అల్వార్ జిల్లాలోని సారై కళాన్ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు లోకేశ్ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రంతా వెతకగా, ఊరి చివర ఓ పాడుబడ్డ ఇంట్లో బాలుడి మృతదేహం లభ్యమైంది. శరీరంపై సూదులు గుచ్చిన గుర్తులు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో లోకేశ్ మేనమామ మనోజ్ కుమార్‌పై అనుమానం కలిగింది. తొలుత బాలుడిని వెతుకుతున్నట్లు నటించినా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో మనోజ్ నేరాన్ని అంగీకరించాడు.

ALSO READ: https://teluguprabha.net/crime-news/widow-sold-by-in-laws-maharashtra/

హత్య వెనుక విస్తుగొలిపే విషయాలు..

పోలీసుల విచారణలో మనోజ్ చేసిన హత్య వెనుక షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. మనోజ్, అతని భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తన వద్దకు రప్పించుకోవాలని భావించిన మనోజ్, సునీల్ కుమార్ అనే మాంత్రికుడిని ఆశ్రయించాడు. నరబలి ఇస్తే భార్య తిరిగి వస్తుందని, పూజల కోసం రూ.12,000, చిన్నారి రక్తం, కాలేయం కావాలని మాంత్రికుడు సూచించాడు.

ALSO READ: https://teluguprabha.net/crime-news/father-kills-son-rajasthan-borewell/

సొంత మేనల్లుడినే..

ఈ తంతు కోసం మనోజ్ తన మేనల్లుడినే ఎంచుకున్నాడు. జూలై 19న చాక్లెట్ ఆశచూపి బాలుడు లోకేశ్‌ని పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం సిరంజీలతో రక్తం తీసే ప్రయత్నం చేసి, శవాన్ని గడ్డివాము కింద దాచిపెట్టాడు. కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాంత్రికుడు సునీల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad