Insurance Fraud UP Couple Arrested: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత తెలివైన మోసానికి పాల్పడి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన దంపతుల ఉదంతం వెలుగు చూసింది. భర్త చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 25 లక్షలు క్లెయిమ్ చేసిన ఒక జంటను లక్నో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
రవి శంకర్, అతని భార్య కేశ్ కుమారి.. ఇద్దరూ కలిసి మోసపూరితంగా పత్రాలను సృష్టించి బీమా సంస్థను మోసం చేశారని పోలీసులు తెలిపారు.
ALSO READ: Teen Kills Pregnant Minor Girlfriend: గర్భిణి అయిన మైనర్ ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన టీనేజర్
ఏం జరిగింది?
లక్నో పోలీసుల ప్రకటన ప్రకారం, అవివా ఇండియా (Aviva India)లో పాలసీదారుడైన రవి శంకర్‌కు డిసెంబర్ 2012లో రూ. 25 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ మంజూరైంది.
2023, ఏప్రిల్ 21న, రవి శంకర్ భార్య కేశ్ కుమారి బీమా కంపెనీకి ఒక క్లెయిమ్ దాఖలు చేసింది. తన భర్త ఏప్రిల్ 9న మరణించినట్లు పేర్కొంటూ రూ. 25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసింది. ఆమె సమర్పించిన పత్రాల ఆధారంగా, బీమా కంపెనీ ఆ క్లెయిమ్‌ను అంగీకరించి, రూ. 25 లక్షల మొత్తాన్ని ఏప్రిల్ 21న ఆమె ఖాతాకు బదిలీ చేసింది.
ALSO READ: Bengaluru Doctor Wife Murder : “నీ కోసమే చంపేశా!” – భార్యను చంపి ప్రియురాలికి డాక్టర్ సందేశం
అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ అంతర్గత విచారణ జరుపుతున్న క్రమంలో షాకింగ్ నిజం బయటపడింది. రవి శంకర్ బ్రతికే ఉన్నాడని తేలడంతో, బీమా సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది.
పోలీసులు విచారణ నిమిత్తం భార్యాభర్తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించగా, వారు మోసాన్ని అంగీకరించారు. అప్పటివరకు తప్పించుకోవడానికి ప్రయత్నించిన దంపతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ALSO READ: Blackmail: అమ్మాయిల నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. 2021లో బెయిల్‌పై తప్పించుకున్న నిందితుడి అరెస్ట్!


