Girl’s Body Found With Slit Throat, Broken Limbs: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక మృతదేహం ఇవాళ ఆమె ఇంటి దగ్గర ఉన్న ఒక తోటలో లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ బాలిక శరీరంపై ఉన్న గాయాలు అత్యంత దారుణమైన హింసను తెలియజేస్తున్నాయి.
ALSO READ: Road Accident: జాతీయ రహదారిపై మరో మృత్యు ఘోష.. రాజస్థాన్‌లో టెంపో అదుపు తప్పి 18 మంది మృతి
అమానుషమైన హింస
హంతకులు ఆ బాలిక గొంతు కోసి, ఆమె చేతులు, కాళ్లు విరిచి, ఆమె ముక్కులో ఇసుక, గ్లూ (జిగురు)ను కూరి చంపారు. హత్యకు ముందు నిందితులు ఆమెపై లైంగిక దాడి కూడా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహం పక్కనే రోదిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఒకరు, బాలికపై అత్యాచారం జరిగిందని పదేపదే చెప్పారు.
కనిపించకుండా పోయిన బాలిక గురించి ఆమె సోదరుడు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చెల్లిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని అతను ఆరోపించాడు.
ALSO READ: BIG Breaking: వికారాబాద్‌లో రక్తపుటేరు.. భార్య, బిడ్డను, వదినను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ఒకరి అరెస్ట్.. అన్ని కోణాల్లో దర్యాప్తు
బహ్రైచ్‌లోని మిహిపుర్వా సర్కిల్ ఆఫీసర్ హర్షితా తివారీ మాట్లాడుతూ, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని ఆమె వివరించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో ఈ దారుణం వెలుగు చూసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ సాపేక్షంగా తక్కువ నేరాల రేటు (58.6)ను కలిగి ఉంది. అయితే, దేశవ్యాప్తంగా మహిళలపై నమోదవుతున్న మొత్తం నేరాల సంఖ్యలో (4,48,211), యూపీ వాటా సుమారు 14.81 శాతంగా ఉంది.
ALSO READ: Pocso Case: లడ్డూ ఆశచూపి.. పసిమొగ్గపై పైశాచికం – మద్యం మత్తులో ఇద్దరు కామాంధుల ఘాతుకం!


