Man Beaten To Death By Sons Over Property Dispute: ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా కన్న కొడుకులే 60 ఏళ్ల వృద్ధుడిని కొట్టి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
శుక్రవారం రాత్రి కరారి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ALSO READ: Crime: దొంగ- పోలీస్ ఆటలో కోడలి మాస్టర్ ప్లాన్.. అత్తను కుర్చీకి కట్టేసి నిప్పంటించి దారుణ హత్య
కోడలికి భూమి ఇస్తానన్నందుకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని దుర్గా ప్రసాద్ (60)గా గుర్తించారు. దుర్గా ప్రసాద్ తన భూమిని తన కోడలికి (పెద్ద కొడుకు భార్యకు) బదలాయించాలని అనుకున్నాడు. అయితే, తన ఇద్దరు కొడుకులైన వీరేంద్ర, విమ్లేష్‌లకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరించాడు.
దీంతో ఆగ్రహించిన వీరేంద్ర, విమ్లేష్‌లు తమ తండ్రిపై కర్రలతో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దుర్గా ప్రసాద్ పెద్ద కొడుకు జ్ఞాన్‌కి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ALSO READ: Stray Dog Attack: రోడ్డుపై వెళ్తున్న 2 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. అధికారులకు శివసేన వార్నింగ్
దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గా ప్రసాద్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గాయపడిన జ్ఞాన్‌ను మెరుగైన చికిత్స కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించారు.
మృతుడి భార్య (వీరేంద్ర, విమ్లేష్‌ల తల్లి) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కొడుకులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.


