Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుHonor Killing: స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతోందని 18 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

Honor Killing: స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతోందని 18 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

Man Beats Daughter To Death Over Calls With Friend: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తన మాట వినకుండా స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతోందనే కోపంతో 50 ఏళ్ల తండ్రి, తన 18 ఏళ్ల కూతురిని కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ ఘటన షాజహాన్‌పూర్ జిల్లాలోని సూట్‌నెరా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని నూర్ మహమ్మద్ (50) గా, మృతురాలిని రూబీ (18)గా గుర్తించారు.

ALSO READ: Teen Kills Pregnant Minor Girlfriend: గర్భిణి అయిన మైనర్ ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన టీనేజర్

విషయం చెయ్యి దాటిందిలా..

రూబీ తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడటం పట్ల నూర్ మహమ్మద్ తరచూ అభ్యంతరం చెప్పేవాడు. ఈ విషయంపై తండ్రీకూతుళ్ల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని పోలీసు సూపరింటెండెంట్ (SP) రాజేష్ ద్వివేది తెలిపారు.

ALSO READ: Bengaluru Doctor Wife Murder : “నీ కోసమే చంపేశా!” – భార్యను చంపి ప్రియురాలికి డాక్టర్ సందేశం

నూర్ మహమ్మద్ ఎంత చెప్పినా రూబీ వినకపోవడంతో, సోమవారం కోపంతో ఆమె ఫోన్‌ను పగలగొట్టి విసిరేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఫోన్ విషయంపై మళ్లీ తండ్రీ కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో, నూర్ మహమ్మద్ ఆవేశంతో ఒక కర్ర తీసుకుని రూబీని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దాడిలో రూబీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది.

పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టగా, అతను గ్రామంలో దాక్కుని ఉండగా పట్టుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, హత్యకు గల పూర్తి కారణాలపై ప్రశ్నిస్తున్నారు.

ALSO READ: Man Murder By Wife: భార్య, ప్రియుడి క్రూరత్వం.. ఏడాది తర్వాత కిచెన్‌లో పూడ్చిపెట్టిన భర్త మృతదేహం లభ్యం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad