Man Drugged And Killed By Wife, Mother-in-Law: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఆస్తి వివాదం కారణంగా అల్లుడిని అతని భార్య, అత్త కలిసి హత్య చేశారు. నిందితులైన భార్య, అత్తలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
జీవన గులియన్ గ్రామంలో ఆదివారం ఉదయం సోను (35) మృతదేహం లభించడంతో, అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు, సోనుకు అతని అత్తతో చాలా కాలంగా ఆస్తి వివాదం ఉన్నట్లు గుర్తించారు. విచారణలో, సోను భార్య సోనియా, ఆమె తల్లి సరోజ్ తామే హత్య చేసినట్లు అంగీకరించారని బినౌలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాకేష్ కుమార్ శర్మ తెలిపారు.
ALSO READ: Blackmail: మత్తు ఇచ్చి, రేప్ చేసి, వీడియోతో 18 నెలలు బ్లాక్‌మెయిల్ చేసిన యువకుడు అరెస్ట్
బ్లాక్‌మెయిల్ తట్టుకోలేక హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనియా తల్లి సరోజ్ కొన్న రూ.3 లక్షల విలువైన ప్లాట్ ప్రస్తుతం రూ.30 లక్షల విలువ చేస్తుంది. ఆ ప్లాట్‌ను తన పేరు మీద రాయాలని సోను, అత్తపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఇక్కడే అసలు విషయం బయటపడింది.
సోనియా చెప్పినదాని ప్రకారం, సోను రహస్యంగా తన అత్త సరోజ్ స్నానం చేస్తున్న వీడియోను చిత్రీకరించాడు. ప్లాట్‌ను తన పేరు మీదకు బదిలీ చేయకపోతే ఆ వీడియోను బహిరంగం చేస్తానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ బెదిరింపులను తట్టుకోలేకపోయిన తల్లి, కూతుళ్లు కలిసి సోనును హత్య చేయాలని పథకం వేశారు.
ALSO READ: Man Jumps Off Water Tank: ప్రేయసి పెళ్లి వార్త విని.. నీళ్ల ట్యాంక్ పైనుంచి దూకిన యువకుడు, మృతి
పథకంలో భాగంగా, శనివారం సాయంత్రం వారు పాలలో నిద్రమాత్రలు కలిపి సోనుకు ఇచ్చారు. అతను గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత, తాడుతో ఉరివేసి చంపారు. ఆ తర్వాత, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, అతని మొబైల్‌ను పగలగొట్టి, గడ్డి నింపిన గదిలో దాచిపెట్టారు. నిందితులైన సోనియా, సరోజ్‌లను మంగళవారం కోర్టులో హాజరుపరచిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


