UP Anoopshahr death case: ఉత్తరప్రదేశ్‌లోని అనూప్‌షహర్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. తాను ప్రేమించిన యువతికి వేరే చోట పెళ్లి నిశ్చయమవడంతో మనస్తాపం చెందిన 22 ఏళ్ల యువకుడు నీళ్ల ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది.
ALSO READ: Wife Shot Dead: పాస్‌పోర్ట్ విషయంలో గొడవ.. కూతురి కళ్ల ముందే భార్యను కాల్చి చంపిన భర్త
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిరౌరా గ్రామానికి చెందిన సాజిద్ అనే యువకుడు మధ్యాహ్నం గ్రామంలోని ఓ నీళ్ల ట్యాంక్‌ను ఎక్కాడు. అతన్ని చూసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అతని కుటుంబ సభ్యులు క్రిందికి దిగమని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా, సాజిద్ నిరాకరించి, ట్యాంక్ పైనుంచి కిందకు దూకాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ధర్మేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ, ప్రాథమిక విచారణలో సాజిద్ ఒక యువతితో ప్రేమలో ఉన్నట్లు తేలిందని, ఆమె వివాహం ఇటీవల వేరే చోట నిశ్చయమైందని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని సాజిద్ తీవ్రంగా కలత చెందాడని, కేసుపై తదుపరి విచారణ జరుగుతోందని శర్మ తెలిపారు.


