Man Kills Wife Over Alleged Affair, Buries Body Inside House: ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో 48 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ మృతదేహాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నరపత్‌పూర్వా ప్రాంతానికి చెందిన నిందితుడు హరి కిషన్‌ను పొరుగున ఉన్న బారాబంకి జిల్లాలోని దుర్గాపూర్ తపేశి గ్రామంలో మంగళవారం అరెస్టు చేసినట్లు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) రామానంద్ ప్రసాద్ కుష్వాహా తెలిపారు.
ALSO READ: Rain Death: ఇంటి పక్కన నిలిచిన వర్షపు నీటిలో మునిగిపోయి రెండేళ్ల చిన్నారి మృతి
మంచం కింద పాతిపెట్టాడు
హర్యానాలో కూలీగా పనిచేసే హరి కిషన్ ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య ఫూలా దేవి (45) అక్టోబర్ 6 నుండి కనిపించకుండా పోయింది. దీంతో అక్టోబర్ 13న ఆమె సోదరుడు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు.
గత శుక్రవారం నాడు ఫూలా దేవి సోదరుడు, హరి కిషన్ మంచం కింద కొత్తగా తవ్విన మట్టిని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ స్థలాన్ని తవ్వగా, ఐదు నుంచి ఆరు అడుగుల లోతులో పాతిపెట్టి ఉన్న ఫూలా దేవి కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. అప్పటికే నిందితుడు హరి కిషన్ ఇంటి నుంచి పరారయ్యాడు.
మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత, మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ALSO READ: Police Lockup Suicide Attempt: పోలీసుల లాకప్‌లో బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు
అక్రమ సంబంధంపై అనుమానం
పోలీసుల విచారణలో, హరి కిషన్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను హర్యానా నుంచి తిరిగి వచ్చినప్పుడు, తన భార్య ఫూలా దేవి గుడ్డు అనే గ్రామస్తుడితో అభ్యంతరకర స్థితిలో ఉన్నట్లు చూశానని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడై ఆమెను హత్య చేసి, ఆ మృతదేహాన్ని తన ఇంట్లోనే పాతిపెట్టానని చెప్పాడు.
నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి, జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Drunk Man Kills Infant: మద్యం మత్తులో భార్యతో గొడవ.. 3 నెలల కొడుకును లోయలో విసిరి, తండ్రి సూసైడ్


