Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుFake Promise: ఆధ్యాత్మిక గురువును కలిపిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

Fake Promise: ఆధ్యాత్మిక గురువును కలిపిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

Fake Promise Of Meeting With Seer Man Rapes Woman: ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను ఏకాంతంగా కలిపించేందుకు ఏర్పాట్లు చేస్తానని మాయమాటలు చెప్పి, ఒక మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

రాధా నివాస్‌కు చెందిన నిందితుడు సుందరం సోషల్ మీడియా ద్వారా ఆగ్రాకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. బాధితురాలు ప్రేమానంద్ మహారాజ్‌కు భక్తురాలు కావడం దీనికి ప్రధాన కారణం.

ALSO READ: Wedding Fund Theft: పెళ్లి ఖర్చుల కోసం చోరీ.. బంధువు ఇంట్లో రూ. 47 లక్షల బంగారం, నగదు మాయం

కోత్వాలీ ఎస్‌హెచ్‌ఓ సంజయ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన సెప్టెంబర్ 12న జరిగింది. ఆగస్టు 10న నిందితుడు మహిళకు మెసేజ్ చేసి, స్వామిజీని ప్రత్యేకంగా కలిసేందుకు ఏర్పాటు చేయగలనని నమ్మబలికాడు. సెప్టెంబర్ 12న ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమెకు తెలిపాడు.

హోటల్‌కు తీసుకెళ్లి మత్తు ఇచ్చి…

పోలీసుల సమాచారం ప్రకారం, మహిళ తన సోదరుడితో కలిసి బృందావనం చేరుకుంది. సుందరం ఆమె సోదరుడిని పార్కింగ్ ప్రాంతంలో వేచి ఉండమని చెప్పి, వాహనాలు ముందుకు వెళ్లవని తెలిపాడు. ఆశ్రమానికి తీసుకెళ్తున్నట్లు నమ్మించి, మహిళను తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకున్నాడు.

ALSO READ: Murder-Suicide: భార్యపై అక్రమ సంబంధం అనుమానం.. ఆమెను కాల్చి చంపి, భర్త సూసైడ్

అయితే, ఆశ్రమానికి బదులుగా, అతను ఆమెను రాధాకృష్ణ ధామ్ అనే హోటల్‌కు తీసుకెళ్లి కాఫీ ఇచ్చాడు. ఆ కాఫీలో మత్తు పదార్థాన్ని కలిపాడని పోలీసులు తెలిపారు. కాఫీ తాగిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోగా, నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోల రూపంలో రికార్డు చేశాడు.

తరువాత, ఆ కంటెంట్‌ను వైరల్ చేస్తానని బెదిరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఎస్‌హెచ్‌ఓ పాండే తెలిపారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిఘా ఆధారంగా పోలీసులు శనివారం మధ్యాహ్నం దేవరహా బాబా ఘాట్ రోడ్డు వద్ద సుందరాన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ALSO READ: Bidi Murder: ‘బీడీ ఇవ్వలేదనే’ గొడవతో హత్య.. ‘బ్లైండ్ మర్డర్’ మిస్టరీ ఛేదించిన పోలీసులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad