ALSO READ: Road Accident: తల్లి మృతదేహాన్ని తీసుకు వెళ్తుండగా కారు ప్రమాదం.. కుమారుడు సహా ముగ్గురు మృతి
తమ్ముడికి ఆస్తి రాసిస్తుందనే భయంతో హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు శీలా దేవి (55) తన ఆస్తి, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3 లక్షల నగదును తన మరొక కుమారుడికి బదిలీ చేస్తుందనే భయంతో కిషన్ కిషోర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. గురువారం సాయంత్రం కిషన్ తన తల్లి శీలా దేవిని గొంతు నులిమి చంపేశాడు.
ALSO READ: Girl Raped: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. బొమ్మలు అమ్ముకునేందుకు వచ్చి..
కొంతకాలంగా శీలా దేవి ఖేర్వా గ్రామంలోని తన బంధువు జై సింగ్ ఇంట్లో నివసిస్తోంది. గురువారం సాయంత్రం, ఆమె మృతదేహం జై సింగ్ ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా, నివేదికలో ఆమె ఉరి వేసుకుని చనిపోలేదని, గొంతు నులమడం వల్లే మరణించినట్లు (strangulation) తేలింది.
పోస్టుమార్టం నివేదిక, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాల ఆధారంగా పోలీసులు కిషన్‌ను ప్రశ్నించారు. విచారణలో, అతనే నేరాన్ని అంగీకరించాడు. దీంతో కిషన్‌ను అరెస్టు చేసి, జైలుకు పంపించినట్లు ఎస్పీ రాజేష్ కుమార్ విలేకరులకు తెలిపారు.
ALSO READ: Girl Sexually Abused: 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ పూజారి లైంగిక దాడి.. పోక్సో కింద అరెస్ట్

