Student, Denied To Sit For Exam Over Fees, Burns Self To Death: ఉత్తరప్రదేశ్‌లోని బుఢానా పట్టణంలో కలకలం సృష్టించిన సంఘటన ఇది. కాలేజీ ఫీజు చెల్లించలేదనే కారణంతో పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి తనపై తానే నిప్పంటించుకుని, ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ నంద్ కిషోర్, కానిస్టేబుళ్లు వినీత్, జ్ఞాన్‌వీర్‌తో సహా ముగ్గురు పోలీసులను లైన్‌కు పంపినట్లు (సస్పెండ్ చేసినట్లు) ఎస్‌ఎస్‌పి సంజయ్ కుమార్ తెలిపారు.
ALSO READ: Lawyer Arrested: రేప్ కేసులో రాజీ కోసం పిలిచి.. క్లయింట్‌పై అత్యాచారం చేసిన న్యాయవాది
న్యాయం కోసం నిరసన, ఆపై దారుణం
మృతుడు ఉజ్వల్ రాణా (22), డీఏవీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాయడానికి అనుమతించకపోవడంతో శనివారం ఉజ్వల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టాడు. ఈ సమయంలోనే ప్రిన్సిపాల్ పోలీసులను పిలిపించారని ఉజ్వల్ కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ పోలీసులు తమ కొడుకును వేధించారని వారు ఆరోపించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఉజ్వల్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
70 శాతం కాలిన గాయాలతో అతనిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించినట్లు ఉజ్వల్ మామ సచిన్ రాణా తెలిపారు. ఉజ్వల్ మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.
ఉజ్వల్ సోదరి సలోని రాణా ఫిర్యాదు మేరకు కాలేజీ మేనేజర్ అరవింద్ గార్గ్, ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, టీచర్ సంజీవ్ కుమార్, మరియు ముగ్గురు పోలీసులపై కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌పి తెలిపారు.
రాజకీయ విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ దీనిని “వ్యవస్థ చేసిన హత్య”గా అభివర్ణించారు. విద్యార్థులపై ఫీజుల విషయంలో కాలేజీల నుంచి వస్తున్న ఒత్తిడికి ఇది నిదర్శనం అన్నారు. ఉజ్వల్ కుటుంబానికి రూ. 1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫీజులను నియంత్రించడానికి చట్టం తేవాలని కూడా కోరింది.
ALSO READ: Delhi bomb blast: ఢిల్లీలో భారీ పేలుడు.. భయానక విజువల్స్.. ముక్కలు ముక్కలైన మృతదేహాలు


