Woman Set On Fire Reaches Hospital On Her Scooter: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో మాట్లాడటానికి నిరాకరించినందుకు ఒక వ్యక్తి, తన స్నేహితులతో కలిసి ఓ వివాహితను నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ తగలబడుతూనే తన స్కూటర్‌పై ఆసుపత్రికి చేరుకుంది, కానీ చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని లక్నో నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరూఖాబాద్‌లో ఆగస్టు 6న జరిగింది.
ALSO READ: Man Killed by Third Wife: లవర్‌తో కలిసి భర్తను చంపిన మూడో భార్య.. శవాన్ని గుర్తించిన రెండో భార్య!
మృతురాలిని 33 ఏళ్ల నిషా సింగ్‌గా గుర్తించారు. నిషా తన పుట్టింటికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఆమె వైద్యుడి దగ్గరికి వెళ్తుండగా, గత రెండు నెలలుగా వేధిస్తున్న దీపక్ అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. తనతో మాట్లాడాలని పదే పదే ఒత్తిడి చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో, దీపక్ తన స్నేహితులతో కలిసి నిషాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మంటల్లో కాలిపోతున్నప్పటికీ, నిషా తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడింది. మంటలతోనే ఆమె తన స్కూటర్ నడుపుకుంటూ తన కుటుంబ వైద్యుడి క్లినిక్‌కు చేరుకుంది. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రికి, అక్కడి నుంచి లోహియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సైఫై ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే నిషా ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.
ALSO READ: Woman Gang Raped: పుట్టినరోజు పార్టీకి పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్
‘నాన్నా, నన్ను కాపాడండి’..
నిషా తండ్రి బలరామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. “డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి చాలా దారుణంగా కాలిపోయింది, త్వరగా రండి అని చెప్పారు. నేను వెళ్లేసరికి ఆమె చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ‘నాన్నా, నన్ను కాపాడండి’ అని బాధతో అరుస్తోంది. ఎలా జరిగిందని అడిగితే, దీపక్ నాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పింది. గత కొన్ని రోజులుగా అతను మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నాడని కూడా చెప్పింది” అని బలరామ్ సింగ్ వాపోయారు.
నిషా సోదరి నీతూ సింగ్ మాట్లాడుతూ, “ఆమె వేధింపుల గురించి నాకు తెలుసు. కానీ తల్లిదండ్రులకు చెబితే ఆందోళన పడతారని చెప్పలేదు. దీపక్ ఆమెను చాలా హింసించేవాడు, తనతో మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు. ఆమె దీన్ని ఇష్టపడలేదు” అని చెప్పారు. ఈ విషయం గురించి తన భర్త అమిత్ చౌహాన్‌కు కూడా తెలియదని అన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.
ALSO READ: odisha crime: 11 ఏళ్ల బాలికపై కామాంధుల అఘాయిత్యం.. అణువణువూ గాయాలే!


