Woman Slits Wrist As Nephew Ends Affair: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడితో ఉన్న అక్రమ సంబంధం తెగిపోయిందన్న మనస్తాపంతో పోలీస్ స్టేషన్ లోపలే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అక్కడివారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా అనే ఈ మహిళకు లలిత్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. వీరికి ఏడు, ఆరు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పనిచేయడానికి భర్త ఇంటికి వచ్చిన తన మేనల్లుడు అలోక్ మిశ్రా (పూజ కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇదే పరిచయం క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది.
ఏడు నెలలు సహజీవనం.. ఆపై తిరస్కరణ
ఈ విషయం భర్త లలిత్‌కు తెలియడంతో, అతను అలోక్‌ను ఇంటి నుంచి పంపించేశాడు. అయితే, పూజ తన ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి మరీ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి వెళ్లింది. అక్కడ అలోక్‌తో కలిసి దాదాపు ఏడు నెలలు సహజీవనం చేసింది.
కొన్ని కారణాల వల్ల పూజ, అలోక్ మధ్య విభేదాలు రావడంతో, అలోక్ తిరిగి తన స్వగ్రామమైన సీతాపూర్‌కు వచ్చేశాడు. అలోక్ వెనుక పూజ కూడా సీతాపూర్ చేరుకోవడంతో, ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుగుతున్న సమయంలో, అలోక్ తాను ఇకపై పూజతో కలిసి ఉండలేనని, సంబంధాన్ని కొనసాగించనని స్పష్టం చేశాడు. ఈ తిరస్కరణను తట్టుకోలేని పూజ మిశ్రా, వెంటనే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో చేతి మణికట్టును కోసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
రక్తం ఎక్కువగా పోవడంతో పూజను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లక్నోకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ: Murder: కొమురం భీం జిల్లాలో పరువు హత్య: 8 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన మామ


