Chef Arrested for Robbing 3 Banks in 1 Day: కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఇటాలియన్ చెఫ్, రెస్టారెంట్ యజమాని వాలెంటీనో లుచిన్ ఒకే రోజు మూడు బ్యాంకులను దోచుకున్నాడన్న ఆరోపణలతో అరెస్టయ్యాడు. సెప్టెంబర్ 10న శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. పోలీసులు లుచిన్‌ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా అరెస్టు చేయగలిగారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం, శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ (SFPD) “అంబాసిడర్స్” కార్యక్రమం దీనికి దోహదపడ్డాయి.
62 ఏళ్ల లుచిన్ ఒకప్పుడు ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ రోజ్ పిస్టోలాకు ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేశారు. అలాగే వాల్‌నట్ క్రీక్‌లో 2016లో మూతపడిన ఒట్టావియో రెస్టారెంట్‌కు యజమాని కూడా. అలాంటి వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నేరాలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో గ్రాంట్ అవెన్యూలో ఉన్న ఒక బ్యాంకులో దోపిడీ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి బ్యాంకులోపలికి వచ్చి, ఉద్యోగికి చేతితో రాసిన నోటును ఇచ్చి డబ్బు డిమాండ్ చేశాడని తెలిసింది. భయంతో బ్యాంకు ఉద్యోగి డబ్బులు ఇచ్చేశాడని, ఆ తర్వాత నిందితుడు డబ్బుతో పారిపోయాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన తర్వాత అదే రోజు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో మరో రెండు బ్యాంకు దోపిడీలు జరిగాయి. వీటిలో కూడా అదే రకమైన మోసం, నేర విధానం (Modus Operandi) ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అన్ని నేరాలకు పాల్పడింది లుచిన్ అనే నిర్ధారణకు వచ్చారు.
ALSO READ: Lover Killed Woman: పెళ్లి కోసం 600 కి.మీలు ప్రయాణించిన మహిళ.. ప్రియుడి చేతిలోనే దారుణ హత్య
SFPD అంబాసిడర్స్, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు లుచిన్‌ను గుర్తించి, వ్యూహాత్మకంగా వ్యవహరించి అరెస్టు చేశారు. లుచిన్‌పై దోపిడీ, దోపిడీకి ప్రయత్నించిన నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదు చేసి, బెయిల్ లేకుండా అదుపులోకి తీసుకున్నారు.
ఇదే మొదటిసారి కాదు..
ఇది అతనికి మొదటిసారి కాదు, 2018లో కూడా అతను ఓ బ్యాంకును దోచుకునేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడు. అప్పుడు ఆయన “అప్పట్లో అది మంచి ప్లాన్ అనుకున్నాను, కానీ అది కాదు” అని చెప్పినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఘటనపై “నా చర్య దూకుడుగా లేదు. అది నకిలీ తుపాకీ. నాకు నిజమైన తుపాకీని ఎలా లోడ్ చేయాలో కూడా తెలియదు” అని ఆయన అన్నారు. “నిస్సహాయత మనకు సాధ్యం కాని పనులను కూడా చేసేలా చేస్తుంది” అని ఆయన చెప్పడం గమనార్హం.
ALSO READ: Three Drown After Cremation: అంత్యక్రియల అనంతరం నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు దుర్మరణం


