Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBizarre Crime: వామ్మో... భర్త నాలుక కొరికి మింగేసిన భార్య!

Bizarre Crime: వామ్మో… భర్త నాలుక కొరికి మింగేసిన భార్య!

Wife Bites Husband Tongue:  భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. కానీ, ఆవేశంలో విచక్షణ కోల్పోతే ఎంతటి దారుణానికైనా తెగబడతారని బిహార్‌లోని ఈ ఘటన నిరూపిస్తోంది. చిన్నపాటి వాగ్వాదం పెరిగి, భర్త నాలుకను భార్య కొరికి, నమిలి మింగేసిందంటే నమ్మగలమా..? అంతటితో ఆగకుండా, రక్తం కారుతున్న భర్తతో ఆసుపత్రిలో కూడా పోరాటానికి దిగడం విస్మయానికి గురిచేస్తోంది. అసలు వారి మధ్య జరిగిన గొడవ ఏంటి..? దీని వెనుక క్షుద్రపూజల కోణం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత..?

సంసారంలోని చిన్నపాటి కలహం పెరిగి, ఓ భార్య రాక్షసిగా మారింది. భర్తపై పట్టరాని కోపంతో ఏకంగా అతడి నాలుకను కొరికి, నమిలి మింగేసిన అమానుష ఘటన బిహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

- Advertisement -

చిన్న గొడవే.. కానీ దారుణం ఘోరం:

గయా జిల్లా ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న దంపతుల మధ్య ఓ సాధారణ విషయంలో వాగ్వాదం మొదలైంది. చూస్తుండగానే మాటామాటా పెరిగి అది పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన భార్య, భర్తపై దాడి చేసి కిందపడేసింది. అంతటితో ఆగకుండా, అతడి నాలుకను గట్టిగా కొరికి ముక్కను వేరు చేసింది. ఆ తర్వాత దానిని నమిలి మింగేసింది.

భర్త హాహాకారాలతో, నోటి నుంచి తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడిపోవడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు. వెంటనే అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనూ వారి మధ్య వాగ్వాదం ఆగలేదని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం.

ALSO READ: https://teluguprabha.net/crime-news/murder-attempt-in-birthday-party-as-friends-pour-liquor-in-used-glass-two-are-serious/

వైద్యుల స్పందన:

“రాత్రి సమయంలో నాలుక తెగిపోయిన స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చారు. అతడిని ప్రశ్నించగా తన భార్యే కొరికిందని చెప్పాడు. అప్పటికే చాలా రక్తం పోయింది. మేము వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అతడిని మగధ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశాం,” అని చికిత్స అందించిన వైద్యురాలు మీనా రాణి తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

ఈ దారుణ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. బాధితుడి నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి గానీ ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటన వెనుక క్షుద్రపూజల ప్రమేయం ఉందంటూ స్థానికంగా వదంతులు వ్యాపిస్తున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/crime-news/drugs-gang-arrested-in-hyderabad-weapons-are-siezed/

గతంలో రాజస్థాన్‌లోనూ..

కొన్ని నెలల క్రితం రాజస్థాన్‌లోని జల్వార్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. భర్తతో గొడవపడిన భార్య అతడి నాలుకను కొరికి తీవ్రంగా గాయపరిచింది. అయితే, ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad