wife killed her husband: భర్తను చంపి తాపీగా శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకున్న భార్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్తను చంపానని ఏమాత్రం పశ్చాత్తాపం గానీ, కంగారు గానీ, భయంగానీ లేకుండా మేకప్ వేసుకుంది. భర్త శవం పక్కనే కూర్చోని అందంపై శ్రద్ధ పెట్టిందంటే ఆ ఖిలాడి మనస్తత్వం ఎంత దారుణమైన అర్థం చేసుకోవచ్చు. హర్యానాలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
హర్యానా పానిపట్ జిల్లాలోని సోనిపట్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఖర్చులకు సరిపడేలా డబ్బులు తేవడం లేదని భర్తను భార్య అతి దారుణంగా చంపేసింది. అంతేకాకుండా అతని శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకుంది. సోనిపట్ గ్రామంలో సురేశ్, పూనమ్ అనే దంపతులు ఉండేవారు. అరవై ఏళ్ల సురేశ్ త్రీ వీలర్ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. అయితే అతని భార్యకు అందంపై విపరీతమై పిచ్చి ఉండేది. మేకప్ కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేది. అందుకు అనుగుణంగా తనకు ఆర్థికస్థామత లేకున్నా.. డబ్బుల కోసం భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేది. అయినప్పటికీ భర్త తన సంపాదనలో కొంత.. తన మేకప్ కోసం వెచ్చించేవాడు.
అనారోగ్యానికి గురైన సురేశ్: అయితే ఈ మధ్య అతనికి అనారోగ్యంగా ఉండటంతో త్రీ వీలర్ నడపడం బంద్ చేశాడు. దీంతో ఇంటికి సరిపోయేంత డబ్బులు సంపాదించలేకపోయాడు. అయినప్పటికీ ఆమెకు అందంపై మక్కువ తగ్గలేదు. దీంతో అతన్ని ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకోవాలని పూనమ్.. సురేశ్‌ను ఒత్తిడి చేసింది . కానీ అతను తన డిమాండ్ నెరవేర్చలేకపోవడంతో చనిపోయేదాక కొట్టినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అక్కడే దర్జాగా రెడీ అయిందని తెలుస్తోంది. కాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.


