Wife killed husband in Tamilanadu: తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి ప్రేమికుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆశతో ఓ మహిళ స్కెచ్ వేసి, ఆ ప్లాన్‌ను అమలు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఈ ఘోర ఘటన వివరాలు బయటపడ్డాయి. వివరాల్లోకెళ్తే.. స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న రసూల్ అనే వ్యక్తికి, ఆయన భార్య అమ్ముబీకి ఇద్దరు పిల్లలు – ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్న వేళ, అమ్ముబీకి అదే గ్రామానికి చెందిన లోకేశ్వరన్ అనే సెలూన్ షాప్ యజమానితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలవడం చూసిన రసూల్, వారి సంబంధాన్ని గమనించి ఒకసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం.
ALSO READ: https://teluguprabha.net/crime-news/mother-killed-by-her-own-son-in-haryana-news-goes-viral-on-social-media/
ఈ ఘటన తరువాత, భర్త అడ్డుగా ఉన్నాడనే ఆలోచనతో అమ్ముబీ తన ప్రియుడితో కలిసి రసూల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. మొదట పురుగుమందును దానిమ్మరసంలో కలిపి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ రసూల్ ఆ రసం తాగలేదు. అనంతరం అదే విషాన్ని ఇంట్లో తయారైన సాంబార్‌లో కలిపి అతనికి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషభోజనం తీసుకున్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/friend-murder-over-phonecall-karnataka/
రసూల్ మృతి అనుమానాస్పదంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో కీలక ఆధారాలుగా కొన్ని వాయిస్ మెసేజీలు లభించాయి. వాట్సాప్‌లో అమ్ముబీ తన ప్రియుడికి పంపిన ఆడియోలో, “నీకు ఇచ్చిన విషం దానిమ్మరసంలో కలిపాను, కానీ తాగలేదు. తర్వాత సాంబార్‌లో కలిపాను – చచ్చిపోయాడు” అని చెప్పినట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆధారాలపై విచారణ జరిపిన పోలీసులు, ప్రేమికులిద్దరినీ అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది.


