Wife murdered husband because of satisfaction: ఈ మధ్యకాలంలో చాలా వరకు భర్తను హత్య చేసిన భార్య అనే వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాము. తాజాగా అలాంటిదే మరొక ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ నగరంలో ఒక భర్త హత్య ఘటన కలకలం రేపింది. వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో భార్య భర్తను హత్య చేసిన ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. జూలై 20వ తేదీన నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఫర్జానా ఖాన్ అనే యువతి తన భర్త మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32) ను తీసుకురాగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మొదటిగా అతడిని ఆత్మహత్యగా చెబుతూ ఆమె పోలీసులకు సమాచారం అందించింది.
అయితే మృతుడి శరీరంపై గాఢమైన గాయాలుండటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపగా, నిపుణుల నివేదికలో ఇది ఆత్మహత్య కాదని, హత్య కావచ్చని పేర్కొనడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. ఫర్జానా చెప్పిన విషయాల్లో అనుమానాస్పదత ఉండటంతో పోలీసులు ఆమె మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. అందులో ఆమె గూగుల్‌లో కొన్ని సెర్చ్ చేయకూడని అంశాలను సెర్చ్ చేసినట్లు, ఆ తరువాత హిస్టరీను తొలగించినట్లు గుర్తించారు. అల్యూమినియం ఫాస్ఫైడ్ (సల్ఫోస్) వంటి పదార్థాల గురించి వివరంగా వెతికినట్లు ఆధారాలు లభించాయి.
పోలీసులు కాస్త కఠినంగా దర్యాప్తు చేయడంతో.. ఆ దర్యాప్తులో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తి పరచలేకపోతున్నాడన్న అసంతృప్తితోనే హత్యకు పాల్పడినట్లు తెలిపింది. షాహిద్‌ను మూడు సార్లు కత్తితో పొడిచిన తర్వాత, ఆత్మహత్యగా మలచేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిందని విచారణలో వెల్లడైంది. పోలీసులు ఆమె నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఫర్జానా గతంలో ఎవరితో చాటింగ్ చేసిందన్న దానిపై కూడా ప్రత్యేక విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉంది, కేసు విచారణ కొనసాగుతోంది.


