Friday, December 12, 2025
Homeనేరాలు-ఘోరాలుCrime: గర్భందాల్చలేదని వేధింపులు.. ఉరేసుకొని తనువు చాలించిన గృహిణి!

Crime: గర్భందాల్చలేదని వేధింపులు.. ఉరేసుకొని తనువు చాలించిన గృహిణి!

Wife suicide after husband harassed: ఆ తల్లిదండ్రులు కుమార్తె భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. ఉన్నంతలో బిడ్డ పెళ్లి ఘనంగా నిర్వహించారు. అల్లుడి స్థోమతకు తగినట్టుగా కట్నకానుకలిచ్చారు. దీంతో ఆ యువతి కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లైన ఆరు నెలలకే భర్త, అత్త వేధింపులు మొదలైయ్యాయి. ఆరునెలలైనా నీకు ఎందుకు గర్భం రావట్లేదని అత్త వేధించడం ప్రారంభించింది. భర్త సైతం ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలెట్టాడు. దీంతో ఆ యువతి ఉరేసుకొని తనువు చాలించింది.

- Advertisement -

ఎందుకు గర్భం రావట్లేదని వేధింపులు: గర్భందాల్చలేదని, ఉద్యోగం చేయాలని భర్త, అత్త వేధింపులకు గురిచేయడంతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. జగిత్యాలకు చెందిన సౌజన్య(27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో గత మార్చి 22న ఘనంగా వివాహం జరిగింది. కిరణ్‌ హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో వారు పెళ్లి అనంతరం భార్య సౌజన్యతో కలిసి టీఎన్‌జీఓస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లై ఆరునెలలు గడుస్తున్నా సౌజన్య గర్భందాల్చక పోవడంతో అత్త వేధించడం ప్రారంభించింది. ఇంట్లో ఖాళీగా ఉండేకంటే ఏదైనా జాబ్‌ చేయచ్చుకదా.. అంటూ భర్త సైతం వేధింపులకు గురిచేశాడు. గర్భందాల్చలేదని, ఉద్యోగం చేయాలని నిత్యం భర్త, అత్త వేధింపులతో ఆ మహిళ తట్టుకోలేక పోయింది. కిరణ్‌ సోమవారం ఉదయం సాఫ్ట్‌వేర్‌ డ్యూటీకి వెళ్లాడు. భర్త సాయంత్రం 4 గంటలకు తిరిగిరాగా సౌజన్య తలుపులు తెరువలేదు.

Also Read:https://teluguprabha.net/crime-news/father-pushed-two-childrens-into-the-godavari-river-at-east-godavari-district/

ఫ్యాన్‌కు చున్నీతో ఉరి: ఆందోళనతో భర్త కిరణ్‌ ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు గడియ విరగ్గొట్టాడు. గదిలోకి వెళ్లి చూడగా సౌజన్య ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోయి ఉంది. వెంటనే కిరణ్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉద్యోగం చేయమని, గర్భం దాల్చలేదని భర్త, అత్త మల్లేశ్వరి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌజన్య తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News