Prostitution in Begumpet: హైదరాబాద్‌లోని బేగంపేట సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మాధవి అనే మహిళ స్మశానంలోని ఒక గదిని వ్యభిచార గృహంగా మార్చింది. ఆ గదిలో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పవిత్ర ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలు: బేగంపేటలోని శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ సమీపంలో గల స్మశాన వాటికలో గుట్టుగా జరుగుతున్న వ్యభిచార పోలీసులు బయట పెట్టారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బేగంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో ఒక మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఆమెతో పాటు ఒక యువతి, ఒక కాంట్రాక్టర్ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మశాన వాటిక వంటి పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరింత లోతుగా దర్యాప్తు: స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించామని పోలీసులు అన్నారు. ఆ మహిళ ఎన్ని రోజుల నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇంకా ఎవరెవరు భాగమయ్యారనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


