Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుVijayawada Crime : సనత్ నగర్ లో దారుణం.. మహిళ పై నలుగురి దాష్టీకం

Vijayawada Crime : సనత్ నగర్ లో దారుణం.. మహిళ పై నలుగురి దాష్టీకం

చట్టాలకు, శిక్షలకు ఎవరూ భయపడటం లేదు. ఏ నేరమైనా మన దేశంలో మరణ శిక్ష అయితే విధించరు కదా అన్న ధీమాతో విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో జరుగుతున్న నేరాల్లో సగానికి పైగా అత్యాచార ఘటనలే ఉంటున్నాయి. ఆ తర్వాత హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మైనర్లు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు ఎన్ని చట్టాలున్నా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.

- Advertisement -

ఓ మహిళను గదిలో బంధించి.. నలుగురు వ్యక్తులు మూడ్రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలోని సనత్ నగర్లో జరిగింది. గత రాత్రి (డిసెంబర్ 19) మహిళ ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను.. అదే ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి.. డిసెంబర్ 17న కానూరు సనత్ నగర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. గదిలో ఆమెను బంధించి.. తన స్నేహితులైన మరో ముగ్గురికి సమాచారమిచ్చాడు.

మూడ్రోజుల పాటు ఆ నలుగురు బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 19 రాత్రి మహిళ తీవ్ర అస్వస్థతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది. మహిళను పరీక్షించిన వైద్యులు.. పెనమలూరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాధిత మహిళ నుండి వివరాలు సేకరించి.. నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు శ్రీను, మరొకరు నాగరాజుగా తెలిసింది. వారిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad