Woman Gang-Raped After Her Birthday Party: మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరుగాంచిన కోల్‌కతాలో మరోసారి దారుణం జరిగింది. తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన ఓ 20 ఏళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దారుణం నగర శివారులోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో జరిగింది.
బాధితురాలి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితుడు చందన్ మాలిక్.. దీప్ అనే తన మరో స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగిసిన తర్వాత బాధితురాలు ఇంటికి వెళ్తాననగా, నిందితులు అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా గదిలో బంధించి, ఇద్దరూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.
ALSO READ: Honour Killing: ఐఏఎస్ కావాలని కలలు కన్న యువతి, పరువు హత్యకు బలి.. తల్లి, సోదరుడు అరెస్ట్
ఈ దారుణం శుక్రవారం రాత్రి జరిగితే, శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నిందితులు దీప్, చందన్ మాలిక్ ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడు చందన్ మాలిక్ ఆమెకు కొన్ని నెలల క్రితమే పరిచయమయ్యాడు. అతను దక్షిణ కోల్‌కతాలో ఒక పెద్ద దుర్గా పూజ కమిటీకి అధ్యక్షుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతని ద్వారానే దీప్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ ఇద్దరూ ఆమెకు పూజ కమిటీలో అవకాశం ఇస్తామని చెప్పి దగ్గరయ్యారని తెలిపింది. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
గతంలో కూడా కోల్‌కతాలో ఇలాంటి ఘటనలు జరిగాయి. లా కాలేజీలో ఓ విద్యార్థినిపై అత్యాచారం, ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ రేప్, హత్య వంటి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ తాజా ఘటన కోల్‌కతాలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
ALSO READ: AP crime: అన్నే కదా అని బైక్ ఎక్కిన బాలిక.. అంత పని చేశాడు ఆ నీచుడు!


