Woman’s Half-Burnt Body Found In Tripura: త్రిపురలోని గోమతి జిల్లాలో శనివారం నాడు సగం కాలిపోయిన మహిళ మృతదేహం లభించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారానికి కారణమైంది. మిర్జా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి భర్త సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు తమ భార్యాభర్తలను తీవ్రంగా కొట్టారని, ఆ అవమానంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపించారు.
ALSO READ: Man Slits Wife Throat: రాజీ కోసం 175 కి.మీ. ప్రయాణం చేసి వచ్చి.. భార్య గొంతు కోసిన భర్త
భర్త ఆరోపణల ప్రకారం, శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే జిజేంద్ర మజుందర్ మేనల్లుడు మన్నా మజుందర్ తో పాటు మరో ఇద్దరు తమపై దాడి చేశారని తెలిపారు. దాడి అనంతరం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఫిర్యాదు తీసుకోడానికి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఇంటికి తిరిగి వచ్చాక శనివారం ఉదయం తన భార్య సగం కాలిపోయిన మృతదేహం సమీపంలోని రోడ్డుపై లభించిందని, తన భార్య మరణానికి మన్నా మజుందర్, అతని అనుచరులే కారణమని భర్త వాపోయారు.
ముఖ్యమంత్రి ఆదేశం, రాజకీయ దుమారం
ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో, ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెంటనే స్పందించారు. “మిర్జా ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారందరినీ చట్టం ప్రకారం శిక్షిస్తాం. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం” అని శనివారం రాత్రి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ALSO READ: Student Suicide: IIT ఖరగ్‌పూర్‌లో కలకలం.. పీహెచ్‌డీ విద్యార్థి అనుమానస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన
మరోవైపు, ఫిర్యాదు తీసుకోడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో కక్రబన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ సర్కార్‌ను సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్ సైతం బాధితురాలి ఇంటిని సందర్శించి నిష్పాక్షిక విచారణకు హామీ ఇచ్చారు.
అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, మహిళను సజీవదహనం చేశారని సీపీఐ(ఎం) ఆరోపించింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు నిందితులందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీసులు తొలుత ‘అసహజ మరణం’ కేసుగా నమోదు చేసినా, భర్త ఆరోపణల మేరకు ‘ఆత్మహత్యకు ప్రేరేపణ’ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Gang Rape: బంధువుల ఇంటికి వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్


