Woman’s Live-In Partner Kills Her Daughter: హర్యానాలోని రేవారి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న భాగస్వామి, కోపం అదుపు చేసుకోలేక ఆమె ఐదేళ్ల కుమార్తెను నేలకేసి కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్‌కు చెందిన నిందితుడు రోషన్ను హత్య కేసు కింద అరెస్ట్ చేసినట్లు రేవారి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రోషన్ గత కొంతకాలంగా వివాహిత అయిన ఆ మహిళతో, ఆమె కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
ALSO READ: Accident: పోర్న్ చూస్తూ కారును ఢీకొట్టిన ట్రక్ డ్రైవర్.. వ్యక్తి దుర్మరణం.. పదేళ్ల జైలు శిక్ష
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రోజున రోషన్‌కు, మహిళకు మధ్య బయట గొడవ జరిగింది. దీంతో ఆ మహిళ కోపంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయింది. రోషన్ మాత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఐదేళ్ల చిన్నారి ఇంట్లోనే ఉంది.
తల్లి కనిపించకపోవడంతో ఆ చిన్నారి ఆమె కోసం ఏడవడం మొదలుపెట్టింది. తనను తల్లి దగ్గరకు తీసుకువెళ్లమని రోషన్‌ను పదేపదే అడిగింది. అయితే, రోషన్ ఆమె మాటలను పట్టించుకోకుండా నిరాకరించాడు. దీంతో చిన్నారి ఏడవడం కొనసాగించింది. ఆమె ఏడుపుతో ఆగ్రహానికి గురైన రోషన్, కోపం పట్టలేక ఆ చిన్నారిని బలంగా నేలకేసి కొట్టాడు. ఈ దాడి కారణంగా బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
ALSO READ: Woman Kidnapped: తాగుబోతు భర్తని విడిచి యువకుడితో మహిళ సహజీవనం.. కిడ్నాప్ చేసిన బంధువులు
ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు రోషన్ ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితుడు రోషన్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ALSO READ: Man Strangles Partner: సహజీవనం చేస్తున్న యువతిపై అనుమానం.. చంపి, బ్యాగులో కుక్కి అనంతరం సెల్ఫీ


