Tuesday, April 15, 2025
Homeనేరాలు-ఘోరాలుDead: మసీదు మిట్టలో యువతి మృతి.. కారణం ఇదే..!!

Dead: మసీదు మిట్టలో యువతి మృతి.. కారణం ఇదే..!!

చిత్తూరు జిల్లాలో మసీదు మిట్టలో విషాదం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మృతి(Dead) చెందింది. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది యాస్మిన్ భాను. పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడిచింది.

- Advertisement -

ఫిబ్రవరి 9న నెల్లూరులో యాస్మిన్ భాను, సాయి తేజలు పెళ్లి చేసుకున్నారు. తిరుపతి ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 13న రక్షణ కావాలని ప్రేమ జంట కోరింది. యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

యాస్మిన్ భానుతో తల్లిదండ్రులు ఫోన్లో సంప్రదిస్తుండేవారు. యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదు పంపించాలని సాయి తేజను కుటుంబ సభ్యులు కోరారు. ఆదివారం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరుకు తీసుకొచ్చాడు భర్త సాయి తేజ్. యాస్మిన్ భానుని సోదరుడు లాలు కారులో తీసుకెళ్లాడు.

ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల ఇంటిలో యాస్మిన్ భాను మృతి చెందారు. యాస్మిన్ భాను తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారని సాయి తేజ్ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చిత్తూరు టు టౌన్ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News