Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుHyderabad: బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ యువతి బెదిరింపు

Hyderabad: బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ యువతి బెదిరింపు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital) బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆ యువతిని కిందకు దించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమస్య ఏంటో చెప్పాలని ఆసుపత్రి సిబ్బందితో పాటు, పోలీసులు ఎంత వేడుకున్నా చెప్పకుండా అలాగే బిల్డింగ్‌పై నిల్చొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్‌లో సదరు యువతి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమెను విధుల్లోంచి తొలగించడంతో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad