YouTuber, Son Arrested For Raping Minor: సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేస్తామని నమ్మించి, ఓ మైనర్ బాలిక అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్, అతని మైనర్ కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బసిర్‌హాట్ పరిధిలోని హారోవా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలి తండ్రి కోల్‌కతా పోలీస్ శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు.
ALSO READ: Girl Raped: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. బొమ్మలు అమ్ముకునేందుకు వచ్చి..
వీడియోల పేరుతో దారుణం
పోలీసుల వివరాల ప్రకారం, హారోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌పూర్‌లో యూట్యూబర్ అరబిందా మొండల్ నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో బాధితురాలైన మైనర్ బాలిక కుటుంబం కూడా నివసిస్తోంది. పొరుగున ఉండటంతో, కొన్ని నెలల క్రితం యూట్యూబర్ అరబిందా మొండల్, అతని మైనర్ కొడుకు కలిసి వీడియోలు, రీల్స్ చేస్తామని చెప్పి బాలికను పిలిచారు.
సామాజిక మాధ్యమాలలో వీడియోలు చేయడానికి బాలికను వివిధ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లారు. మొదట్లో, నిందితులు పొరుగున ఉండటం వలన బాలిక కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. అయితే, వీడియోలు తీసే క్రమంలో బాలిక అనుమతి లేకుండా ఆమెకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫోటోలు, వీడియోలను రికార్డు చేశారు.
ALSO READ: Fake Promise: ఆధ్యాత్మిక గురువును కలిపిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
బ్లాక్‌మెయిల్ చేసి, అత్యాచారం
ఆ తర్వాత, ఆ అభ్యంతరకర ఫోటోలు, వీడియోలతో బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. “ఎవరికైనా చెబితే, ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. బాలిక భయంతో మౌనంగా ఉండటంతో, నిందితులు అరబిందా, అతని మైనర్ కొడుకు కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు” అని బసిర్‌హాట్ పోలీసులు తెలిపారు.
శుక్రవారం రోజున ఆ బాలిక జరిగిన విషయం మొత్తాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితులైన తండ్రి, కొడుకులపై హారోవా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం ఉదయం నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని బసిర్‌హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు తరలించారు.
ALSO READ: Crime: గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్.. గాంధీకి తరలిస్తుండగా బాధిత మహిళ మృతి!


