Friday, December 12, 2025
Homeదైవం25 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు అస్సలు తొందరపడొద్దు.. జాగ్రత్తలు తీసుకోకుంటే...

25 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు అస్సలు తొందరపడొద్దు.. జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు..!

25 October Saturday Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం 12 రాశుల వారికి ప్రతి రోజూ ఒక్కో విధంగా రాశి ఫలాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం, చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారిస్తున్నాడు. చవితి తిథి, అనురాధ నక్షత్రం ప్రభావంతో ఏ రాశి వారికి ఇవాళ (శనివారం) కలిసొస్తుందో తెలుసుకుందాం. 12 రాశుల్లో ఏ రాశి వారు ఎలాంటి ఫలాలు పొందుతారు? ఏ రాశి వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు? ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి? అనే విషయాలపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

మేషం

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. వీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సత్కార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు.

వృషభం

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ హాస్యచతురత ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి.

మిథునం

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా తోటివారి సలహాలు, సూచనలు మేలు చేస్తాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. చిన్న విషయాలకు చికాకు పడతారు.

సింహం

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దలను సంప్రదించి పనులు పూర్తి చేయండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కన్య

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లక్ష్య సాధనకు కాస్త ఓర్పు అవసరం. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

తుల

ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చక్కబెట్టుకుంటారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో శారీరక శ్రమ అధికమవుతుంది.

ధనుస్సు

ఈ రాశి వారికి శుభ ఫలితాలు. ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.

మకరం

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. పనులలో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. ఓర్పుతో మెలగడం మంచిది. వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి.

కుంభం

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో చేసే పనులు విజయాన్నిస్తాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు.

మీనం

ఈ రాశి వారు అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News