ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య(Ayodhya)లోని బాలరాముడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. అందుకే శ్రీరామనవమిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు పెద్ద పండుగలా జరుపుకుంటారు.
ఈ రోజున సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బాలరాముడికి సూర్యభగవానుడు సూర్య తిలకం దిద్దే దృశ్యాలు భక్తులు వీక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ అద్బుత దృశ్యం కనువిందు చేయనుంది. గతేడాది శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్య భగవానుడు బాలరాముడిని తాకిన విషయం తెలిసిందే.
ప్రతి ఏడాది శ్రీరామనవమికి బాలరాముడి నుదిటి పైకి భానుడి కిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార, పుటాకార కటకాలను నిర్మాణ సమయంలో అమర్చిన విషయం తెలిసిందే.