Money plant: వాస్తు శాస్త్రం మనకు అనేక విషయాలను తెలుపుతుంది. మన ఎదుగుదలలో వాస్తు అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం ఉండే ఆవరణంతో పాటుగా మన ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉంటే కలసి వస్తుందో సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ముఖ్యంగా ఎనిమిది దిక్కుల గురించి వివరిస్తుంది. వాటిలో ఉత్తర దిక్కుది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆ దిశ కుబేరుడితో ముడిపడి ఉంటుంది. ఈ దిశలో వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు కల్గుతుందని నమ్మకం. అలాగే సానుకూల శక్తి ప్రవాహం నిరంతరం ఉండును. ఎందుకంటే కుబేరుడు సంపదకు అధిపతి అని నమ్మకం. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిశలో ఏ వస్తువు పెట్టుకోవాలి.. ఏ వస్తువు పెట్టుకోకూడదో తెలుసుకుందాం.
కుబేర యంత్రాన్ని పెట్టడం ఉత్తమం: ఎవరైనా సరే ఇంట్లో మరియు ఆఫీసులో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే సానుకూల ఫలితాలను పొందుతారని వాస్తు శాస్ర్తం సూచిస్తుంది. వాస్తు శాస్త్రంలో ప్రతి దిశ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఉత్తర దిశ సంపద, శ్రేయస్సుకు రూపమైన కుబేరుడికి సంబంధించినది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో డబ్బు లేదా ఖజానా పెట్టే ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయని నమ్ముతారు. దీనితో పాటు మీరు ఈ దిశలో కుబేర దేవుడి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీకు ఆర్థిక లాభాలకు అవకాశాలను సృష్టిస్తుంది. దీనితో పాటు ఈ దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారస్తులు వ్యాపారంలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఉత్తర దిశలో వేటిని ఉంచడం ప్రయోజనం: కుబేరుడి ఆశీర్వాదం పొందడానికి ఉత్తర దిశలో ఒక చిన్న ఫౌంటెన్ లేదా స్ఫటిక తాబేలు వంటి వాటిని ఉంచవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నది, జలపాతం మొదలైన చిత్రాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహింపజేస్తుంది. ఇంట్లో ఉత్తర దిశలో చెప్పులు, చెత్తబుట్ట లాంటి వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు రావచ్చు. ఉత్తర దిశను మురికి వస్తువులను సైతం ఉంచరాదు.
Also read- Akshaya Tritiya: నేడే అక్షయ తృతీయ.. ఈ 5 వస్తువులను కొనకండి.. కొంటే కష్టాలు తప్పవు!
కుబేర దిశలో ఏ మొక్కలు పెట్టడం ఉత్తమం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్, తులసి వంటి మొక్కలను ఉంచుకోవడం ఉత్తమం. దీనివల్ల సంపద పెరుగును. దీనితో పాటు ఇంటికి ఉత్తర దిశలో వెదురు మొక్కను నాటడం వలన ప్రయోజనాలను పొందవచ్చు.

