శ్రీ మహాయోగి తిక్క లక్ష్మమ్మ అవ్వ 91వ వెండి రథోత్సవం వేలాది మంది బక్తాదుల సందోహంలో శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. ఉదయం నుంచి శ్రీ తిక్క లక్ష్మమ్మ అవ్వకు కాయ కర్పూరం, కుంకుమార్చన, పూలు నైవేద్యం పలు విధాలుగా అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలో సేవా దాతలు అల్పాహారం, జుస్ ,మజ్జిగ,మంచినీళ్లు, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ దంపతులు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ శివ నారాయణస్వామి దంపతులు, శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి దంపతులు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తో పాటు పలువు రాజకీయ నేతలు వివిధ శాఖల అధికారులు కుటుంబాల సమేతంగా శ్రీ లక్ష్మమ్మవారిని దర్శించుకున్నారు. కొలిచే వారికి కొంగుబంగారంగా విరజిల్లే శ్రీ మహాయోగి తిక్క లక్ష్మమ్మను దర్శించుకునేందుకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి ఏడాది తరలి రావడం జరుగుతుంది. డీఎస్పీ శివ నారాయణ స్వామి సమక్షంలో ముందస్తు జాగ్రత్తలతో పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించి ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. మానవ జన్మ నుంచి పలు లీలలు ప్రదర్శించి దైవ మందిత్రాలుగా భక్తులతో పూజలు అందుకోవడమే తిక్క లక్ష్మమ్మ ప్రత్యేకత అంటూ ఆలయ కమిటీ సభ్యులు చెప్పుకొస్తున్నారు. తిక్క లక్ష్మమ్మ అవ్వ శక్తి అని నమ్మకంతో కొలిస్తే కోరికలు తీర్చే మహా తల్లి అంటూ భక్తులు నమ్మకం.