Friday, July 5, 2024
HomeదైవంAhobilam: అహోబిలంలో ఘనంగా హెరిటేజ్ వాక్

Ahobilam: అహోబిలంలో ఘనంగా హెరిటేజ్ వాక్

ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో సాంస్కృతిక వారసత్వ యాత్రను అహోబిల మఠం పీఠాధిపతి అనుజ్ఞ మేరకు నిర్వహించారు. అహోబిలం దేవస్థానంలో నంద్యాలకు చెందిన ఇంటాచ్ వారి సహకారంతో హెరిటేజ్ వాక్ (సాంస్కృతిక వారసత్వ యాత్ర) ఘనంగా జరిగింది. నంద్యాల రవీంద్ర విద్యా సంస్థలు ఆళ్ళగడ్డ ప్రజ్ఞ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సత్యనారాయణ, కేంద్ర పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ నోడల్ అధికారి చేతన్ హాజరై మాట్లాడుతూ అహోబిలం ఒక గొప్ప వారసత్వ స్థలమని, మన వారసత్వ సంపదలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటాచ్ నంద్యాల చాప్టర్ కన్వీనర్ శివ కుమార్ పారువేట ఉత్సవంపై రూపొందించిన రిపోర్ట్ ను కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖాధికారులకు అందజేశారు. దేవస్థానం జీ. పి.ఏ సంపత్ ఓఎస్డీ శివప్రసాద్ లు అతిథులను సత్కరించారు. కల్యాణ మంటపం ఆవరణలో మొక్కలు నాటారు. పచ్చ జెండా ఊపి విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. మాడవీధులలో సాగిన ర్యాలీలో విద్యార్థులు మన వారసత్వ సంపదను రక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు ఎలక్ట్రిసిటీ ఏడీఈ రవికాంత్ చౌదరీ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు దిగువ అహోబిలం ఆలయమును సందర్శించి, ప్రాచీన వాస్తు శిల్ప కళలను వీక్షించి, వాటి చరిత్రను తెలుసుకున్నారు.
దేవస్థానం వార్తాలేఖను ప్రారంభించిన పీఠాధిపతి..

- Advertisement -

శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ఆజ్ఞ మేరకు, అహోబిలం దేవస్థానంలో జరిగే ఉత్సవ వైభవాలను భక్తులందరికి తెలియజేసే ఉద్దేశంతో “శ్రీ అహోబిల వాణి” అనే వార్తా లేఖను పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ప్రారంభించారు. ఈ వార్తా లేఖ ద్వారా భక్తులకు ప్రతి నెలలో జరిగే ఉత్సవాలను నేరుగా తెలియజేస్తామని అధికారి కీడాంబి సేతురామన్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News