Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: చెంచులతో అహోబిలం పీఠాధిపతి ఆత్మీయ సమావేశం

Ahobilam: చెంచులతో అహోబిలం పీఠాధిపతి ఆత్మీయ సమావేశం

మహాగొప్పదైన హిందూ ధర్మాన్ని వీడద్దన్న పీఠాధిపతి

హిందు ధర్మం శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారం కోసం ,ప్రాచీనమైన “అహోబిల నృసింహ దాస” కార్యక్రమాన్ని శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ వన్ శఠగోపయతీంద్రమహాదేశికన్ ప్రారంభించారు. శనివారం అహోబిలంలోని మఠంలో చెంచులతో పీఠాధిపతి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చెంచులు నరసింహ స్వామికి అత్యంత ప్రీతిపాత్రులని, సాక్షాత్ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించిందని చెప్పారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ శ్రీవైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు మోక్షం పొందవచ్చని అందుకోసం ఆచార్యుని ఆశ్రయించి శంఖ చక్ర ముద్రాధారణము చేసి శరణాగతి చేయాలని తెలిపారు. హిందు ధర్మం చాలగొప్పదని స్వధర్మాన్ని విడువరాదని అన్నారు.

- Advertisement -


అహోబిలం దేవాలయానికి అవసరమైన తేనెను చెంచుల నుండి కొనాలని పీఠాధిపతి నిర్ణయించారు. చెంచులలో బాగా చదివే పిల్లలకు పారితోషికం(స్కాలర్షిప్) ఇస్తామని చెప్పారు.అహోబిల నరసింహ స్వామి పారువేట కు వెళ్లే గ్రామాలలో హిందు ధర్మమ్ శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చెంచు మహిళలకు అమ్మవారి ప్రసాదంగా శేష వస్త్రాన్ని కుంకుమను, మంత్రాక్షతలను అనుగ్రహించారు. చెంచులు పీఠాధిపతికి విల్లమ్ములను జ్ఞాపికగా సమర్పించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిధి సంపత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News