Monday, February 16, 2026
HomeదైవంAmalaki Ekadashi 2026: అమలకీ ఏకాదశి నాడు ఈ చిన్న పని చేస్తే చాలు.. మీ...

Amalaki Ekadashi 2026: అమలకీ ఏకాదశి నాడు ఈ చిన్న పని చేస్తే చాలు.. మీ దరిద్రం పరార్..!

Amalaki Ekadashi 2026 Significance in Telugu: హిందువులకు ఏకాదశి చాలా ప్రత్యేకం. ప్రతి ఏటా ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అమలకీ ఏకాదశి’ అంటారు. దీనినే ‘రంగభరి ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. 2026 సంవత్సరంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే విష్ణు పూజ, ఉసిరి చెట్టు ఆరాధన జన్మజన్మల పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం.

- Advertisement -

అమలకీ ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ‘అమలకీ’ అంటే ‘ఉసిరి’. బ్రహ్మదేవుడిని సృష్టించిన సమయంలోనే శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టును కూడా సృష్టించాడని, ఈ వృక్షంలో విష్ణుమూర్తి నివసిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు ఉసిరి చెట్టుకు పూజ చేయడం వల్ల సాక్షాత్తూ శ్రీహరి కృప లభిస్తుంది.

తేదీ మరియు ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 26, 2026 అర్ధరాత్రి 12:33 గంటలకు.

ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 27, 2026 రాత్రి 10:32 గంటలకు.

వ్రత తేదీ: ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి 27, 2027 (శుక్రవారం) నాడు ఏకాదశి వ్రతం ఆచరించాలి.

పూజా ముహూర్తం: ఉదయం 6:15 నుండి 9:40 గంటల వరకు.

వ్రత పారణ (ఉపవాసం విరమణ): ఫిబ్రవరి 28, 2026 ఉదయం 7:07 నుండి 9:28 గంటల మధ్య.

Also Read: Blood Moon 2026 -మార్చి 3న ‘బ్లడ్ మూన్’.. ఎక్కడ చూడొచ్చంటే?

పూజా విధానం
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. సమీపంలోని ఉసిరి చెట్టు వద్దకు వెళ్లి చుట్టూ శుభ్రం చేసి ధూపదీపాలు వెలిగించాలి. శ్రీమహావిష్ణువుకు ఉసిరి కాయలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. దీనిని రంగభరి ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి రంగులు (అబీర్-గులాల్) సమర్పించడం శుభప్రదం.

Also Read: Holika Dahan 2026 – గ్రహణం నీడలో హోలీ.. మార్చి 3న హోళికా దహనం చేయొచ్చా?

కష్టాలను తొలగించే ‘గుప్త దానం’
అమలకీ ఏకాదశి రోజున చేసే దానానికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ‘ఉసిరి కాయల గుప్త దానం’ ఎంతో విశేషమైనది. ఒక రాగి లేదా ఇత్తడి పాత్రలో కొన్ని తాజా ఉసిరి కాయలు, తగినంత దక్షిణ (నాణేలు లేదా నోట్లు) ఉంచాలి. దీనిని పసుపు రంగు వస్త్రంతో కప్పి, ఎవరికీ తెలియకుండా ఒక బ్రాహ్మణుడికి లేదా అవసరంలో ఉన్న వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని, ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News